![]() |
![]() |
.webp)
తండేల్ మూవీకి ఇన్స్పిరేషన్ గా నిలిచినా రియల్ లైఫ్ జోడి ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చారు. వాళ్ళే రామారావు-నూకమ్మ. రష్మీ అసలు వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీని చెప్పించింది. "మా ఆయన పాకిస్తాన్ బోర్డర్ దాటేసి వాళ్లకు దొరికి పోయాడు అని తెలిసేసరికి నాకు చాలా భయమయ్యింది.
ఎందుకంటే ఇండియా - పాకిస్తాన్ మధ్య పగ ఉంది కాబట్టి ఆ కోపంతో చంపేస్తారని చాలా భయపడ్డాను. మా 22 కుటుంబాలు కూడా చాలా షాకయ్యాము. ఎం చేయాలో అర్ధం కాలేదు." అని చెప్పింది నూకమ్మ. ఇక ఈ షోలో సోల్జర్ చక్రపాణి "బుజ్జి తల్లి" సాంగ్ పాడి అందరినీ మెస్మరైజ్ చేసాడు. తర్వాత పంచ్ ప్రసాద్, నటీ నరేష్ కలిసి చీరలమ్మేవాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఇక ఫైమా ఐతే "చిలకల చీర ఉందా" అనేసరికి "ఎలుకల చీర ఉంది..మొత్తం ఎలకలు కొట్టేసిన చీరలవి" అని కౌంటర్ వేసాడు పంచ్ ప్రసాద్. ఇక "రష్మీ గారు వేసుకునే డ్రెస్ కావాలి" అంటూ శ్రీదేవి అడిగింది. దానికి ప్రసాద్ చిన్న పీలిక చూపించాడు. "అదేంటి ఇంత కురచగా ఉన్నవి వేసుకుంటారా" అని శ్రీదేవి అనేసరికి "ఇది కూడా లూజ్ ఐపోయింది" అని పక్కన పెట్టేసారు అని అన్నాడు ప్రసాద్. ఇక ఫైనల్ గా రవి కిరణ్ భావన ఇంకొంతమంది పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీగా స్కిట్ చేశారు. హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో రవి కిరణ్ మందు తాగడం అలవాటు చేసుకుని చివరికి చనిపోయిన తీరును కళ్ళకు కట్టినట్టు చూపించారు. దాంతో స్టేజి మీద ఉన్న అందరితో కన్నీళ్లు పెట్టించారు.
![]() |
![]() |